షాద్‌నగర్: బీజేపీ ఓటు చోరీ కుట్రలను పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా అడ్డుకోవాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న మండలాలు, మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సింహారెడ్డి మాట్లాడారు. బీజేపీ సర్ పేరుతో తమ వ్యతిరేక ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిని అడ్డుకునేందుకు గాను పార్టీ బీఎల్‌ఓలను నియమించిందని, వీరు ప్రతి అంశాన్ని నిషితంగా పరిశీలించి ఓటు చోరీని అడ్డుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. కొత్తగా ఎన్నికై న వారు పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా నలమోని శ్రీధర్, కొత్తూరు మున్సిపాలిటీ అధ్యక్షుడిగా సుదర్శన్, ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడిగా రాయికల్ శ్రీనివాస్, కొందుర్గు అధ్యక్షుడిగా పురుషోత్తంరెడ్డి, నందిగామ అధ్యక్షుడిగా కుమారస్వామి, కొత్తూరు అధ్యక్షుడిగా శేఖర్‌రెడ్డి, కేశంపేట అధ్యక్షుడిగా రమేష్, చౌదరిగూడ అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌కు నియామక పత్రాలు అందజేసి సత్కరించారు.
డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి


