షాబాద్: సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం బహుజనులంతా నడుం బిగించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ ముదిరాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం జేఏసీ జిల్లా అధ్యక్షుడు జంగా రజనీకాంత్ యాదవ్, ఉపాధ్యక్షుడు రమేష్ యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బహుజనులంతా ఏకం కాకుంటే, ఐకమత్యంగా పోరాడకుంటే సామాజిక న్యాయం, రాజ్యాధికారం దక్కవని తెలిపారు. డీబీఎస్ మద్దతుతో జేఏసీ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు జిల్లా నుంచి వేలాదిగా బహుజనులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ చేవెళ్ల ఇన్‌చార్జి మల్లేష్, నాయకులు యాదయ్య, శ్రీనివాస్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


