ప్రయాణికుల సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల సమస్యలు పరిష్కరిస్తాం

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

షాద్‌నగర్‌రూరల్‌: ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని డీఎం ఉష అన్నారు. మంగళవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ డీఎంకు పలువురు ప్రయాణికులు ఫోన్‌ చేసి సమస్యలు ఆమె దృష్టికి తెచ్చారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన డీఎం ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం షాద్‌నగర్‌ డిపోకు చెందిన రెండు డీలక్స్‌ బస్సులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. హైదరాబాద్‌–ఆత్మకూరు, హైదరాబాద్‌–జూరాల డీలక్స్‌ బస్సుల అప్‌ అండ్‌ డౌన్‌ కోసం ఆన్‌లైన్‌లో టికెట్స్‌ తీసుకోవచ్చని సూచించారు.

డయల్‌ యువర్‌ డీఎంలో షాద్‌నగర్‌ డీఎం ఉష

Advertisement
 
Advertisement
Advertisement