కొత్తూరు: నందిగామ మండలం చేగూరులో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ పూజా కార్యక్రమానికి బుధవారం మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఈ మేరకు షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హరీశ్‌రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉదయం 9.30 గంటలకు తిమ్మాపూర్ వద్ద ఏర్పాటు చేసే స్వాగత కార్యక్రమంలో పాల్గొని విజయంతం చేయాలని ఆయన కోరారు.
కొందుర్గు: ప్రస్తుత సమాజంలో హిందూ సంస్కృతి, సంప్రదాయాలు సన్నగిల్లుతున్నాయని, కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అంబాత్రేయ పీఠాధిపతి ఆధిత్య పరాస్వామి అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్‌పహాడ్ వేదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ, గురు నిలయం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేదగిరి గుట్ట గిరి ప్రదక్షిణ చేస్తే తనకు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన అనుభూతి కలిగిందన్నారు. వేదగిరిగుట్ట అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వేదగిరి వ్యవస్థాపకుడు మర్రి కృష్ణారెడ్డి, సర్పంచ్ రామచంద్రయ్య, నాయకులు కృష్ణా రెడ్డి, అందె బాబయ్య, శ్రీవర్దన్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, రాజు, కుర్మయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా ఊటు యశ్వంత్ ఎన్నికయ్యారు. రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి హుస్సేన్ ఆదేశాల మేరకు మంగళవారం నాంపల్లి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీ కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా యశ్వంత్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా మాధవ్‌గౌడ్ (హెచ్‌డబ్ల్యూఓ), వైస్ ప్రెసిడెంట్ రంగయ్య (అగ్రికల్చర్), అంజాద్ అలీ (వైద్య), రాజశేఖర్ (రెవెన్యూ), వాణి (ప్రణాళిక), కార్యదర్శి శ్రీనివాస్‌రావు (మెడికల్), జాయింట్ సెక్రట్రీలుగా శ్రీనివాస్, గాయత్రి, కార్తీక్, అమృత, ట్రెజరరీ ఆనంద్‌సింగ్ (రెవెన్యూ), ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాధర్, పబ్లిక్ సెక్రట్రీ శివకుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా మల్లేష్‌గౌడ్, నసీరుద్దీన్, వెంకట్‌రెడ్డి, విజిత శేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న యశ్వంత్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు.
షాద్‌నగర్‌రూరల్: బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా పసుపుల ప్రశాంత్ నియమితులయ్యారు. పట్టణంలోని కార్యాలయంలో బీసీ జనసేన జాతీయ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో మంగళవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌కు నియామక పత్రం అందజేశారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలందరినీ ఏకంచేసి బీసీ జనసేనను ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ జనసేన నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ, పట్టణ అధ్యక్షురాలు కాటం రాజ్యలక్ష్మి గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్, నాయకులు సత్యం, రాములు, వెంకటయ్య, సాయి, తరుణ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.


