బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

బాధ్యతల స్వీకరణ టీఎన్‌జీఓల సంఘం నూతన కమిటీ ఎన్నిక మానవత్వం చాటుకున్న సీఐ ఎంజీబీఎస్‌కు జర్నీ కళ! క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

ఇబ్రహీంపట్నం రూరల్‌: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా డాక్టర్‌ కిరణ్మయి కొప్పిశెట్టి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్‌కలెక్టర్‌గా పని చేశారు. జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్‌ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: టీఎన్‌జీఓల సంఘం అర్బన్‌ యూనిట్‌ నూతన కమిటీ ఎన్నికను ఆదివారం నిర్వహించారు. పలుబాయి ఈశ్వర్‌ పర్యవేక్షణలో ఎన్నిక కొనసాగింది. అధ్యక్షుడిగా గోపాల్‌ నాయక్‌ (వ్యవసాయ శాఖ), కార్యదర్శిగా సాయితేజ (ట్రెజరీ), ఏంఏ ఫిరోజ్‌ (ఆడిట్‌ విభాగం), ఉపాధ్యక్షులుగా శ్రీపతికుమార్‌ (వ్యవసాయ శాఖ), రవి, జి.సాయికుమార్‌ (ట్రెజరీ), సంయుక్త కార్యదర్శిగా స్వాగ్యవతి (సీ్త్ర సంక్షేమశాఖ), ఆర్గనైజింగ్‌ సెక్రట్రీగా భిక్షపతి(రెవెన్యూ), ప్రచార కార్యదర్శిగా మల్లేష్‌ (గిరిజన సంక్షేమశాఖ), ఈసీ సభ్యులుగా బాలరాజు, శంకర్‌ రాథోడ్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అడ్‌హక్‌ కమిటీ నాయకులు రంగయ్య, యశ్వంత్‌, శ్రీనివాస్‌, మాధవ్‌, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

యాచారం: హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ మానవత్వం చాటుకున్నారు. కందుకూరు మండలం మాలగూడూరు గ్రామానికి చెందిన బండి కరుణాకర్‌ ఆదివారం వ్యక్తిగత పనిమీద మీరాఖాన్‌పేటకు బైక్‌పై వచ్చి తిరుగుపయనమయ్యాడు. మార్గ మధ్యలో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కరుణాకర్‌ను వెంటనే తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 108కు సమాచారం అందించగా మార్గమధ్యలో 108 వాహనం రావడంతో అందులో ఎక్కించి నగరంలోని ఓ ప్రవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అఫ్జల్‌గంజ్‌: మహాత్మాగాంధీ బస్టేషన్‌ ఆదివారం ప్రయాణికులతో కళకళలాడింది. ఆర్టీసీ మూడు రోజుల సమ్మె కారణంగా ఆగిపోయిన ప్రయాణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. బస్టేషన్‌ ఆవరణ లోని ప్లాట్‌ఫాంలు పూర్తిగా నిండిపోయాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

ధారూరు: స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సతీమణి స్వర్గీయ గడ్డం శైలజా స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆదివారం మండల కేంద్రంలో సర్పంచ్‌ ప్రమీలగౌడ్‌ ప్రారంభించారు. ఇరుజట్ల తరఫున ఎస్‌ఐ రాఘవేందర్‌ టాస్‌ వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత అన్ని క్రీడల్లో పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కల్వ కిరణ్‌కుమార్‌, లింగనపల్లి అశోక్‌ ముదిరాజ్‌, టీ మల్లేశం, బుజ్జయ్య గౌడ్‌, సంగమేశ్వర్‌, పంచాయతీ వారు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement