చెట్లను కొట్టేయొద్దు | - | Sakshi
Sakshi News home page

చెట్లను కొట్టేయొద్దు

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

చెట్లను కొట్టేయొద్దు అనంత వేదిక కృషి అభినందనీయం

కేబీఆర్‌ పార్కు ఎదుట పర్యావరణవేత్తల ఆందోళన

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయంటూ పచ్చని చెట్లను కొట్టివేయడాన్ని తక్షణమే ఆపాలంటూ ‘సేవ్‌ కేబీఆర్‌’ సంస్థకు చెందిన ప్రకృతి ప్రేమికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కేబీఆర్‌ పార్కు చుట్టూ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంలో భాగంగా 1942 చెట్లను కొట్టివేస్తున్నారని, ఇది హరిత హననం కిందకు వస్తుందని ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రీనరీని పెంచాలని, కాంక్రీట్‌ను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. వీరితో పాటు కేబీఆర్‌ పార్కు వాకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేబీఆర్‌ పార్కు ముందు ‘సేవ్‌ కేబీఆర్‌’ పేరిట ఆందోళన నిర్వహించారు. ప్రముఖ పర్యావరణవేత్త, సేవ్‌ కేబీఆర్‌ ప్రతినిధి కాజల్‌ గుప్తా మాట్లాడుతూ.. సహజసిద్ధ ఆక్సిజన్‌ కావాలంటే చెట్లను కాపాడాలన్నారు.

బొంరాస్‌పేట: స్థానిక కవులు, సాహిత్య కృషిని వెలికి తీయడంలో వికారాబాద్‌ జిల్లా అనంత వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ వాగ్గేయకారుడు, జిల్లా ప్రముఖ కవి శ్రీ రాకమచర్ల వెంకటదాసు సంచికను ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పలువురు రాకమచర్ల సంకీర్తలను కీర్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్‌ నామోజు బాలాచారి సంచికను ఆవిష్కరించారు. రాకమచర్ల సంకీర్తలను ప్రచారం చేయడంలో జిల్లా కవులు, రచయితల ప్రాత ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో అనంత వ్యవస్థాపకులు దోరవెటి చెన్నయ్య, అధ్యక్షుడు ఆశీర్వాదం, కార్యదర్శి కమలేశ్‌, ఉపాధ్యక్షుడు వడిచర్ల సత్యం, అనంత సభ్యులు రవూఫొద్దీన్‌, మధుసూదన్‌రావు, డాకన్న, సురేశ్‌, రమేశ్‌, మల్లికార్జున్‌, రవికృష్ణస్వామి, రామన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement