ఇబ్రహీంపట్నం రూరల్: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలోని దండుమైలారం, ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసాలకు గురికాకుండా ప్రభుత్వ మద్దతుతో నేరుగా ధాన్యం విక్రయించే అవకాశం కల్పిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కౌన్సిలర్ ఆకుల యాదగిరి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, వ్యవసాయ శాఖ అధికారి విద్యాధరి, ఐకేపీ అధికారి సత్యనారాయణ, దండుమైలారం సర్పంచ్ నరేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


