డీజే నిర్వాహకులపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

డీజే నిర్వాహకులపై కేసు నమోదు

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

కేశంపేట: ఎలాంటి అనుమతులు లేకుండా డీజే నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ.. మండల పరిధిలోని చౌలపల్లి గ్రామానికి చెందిన ముష్రఫ్‌ తలకొండపల్లి మండలం పడకల్‌ గ్రామానికి చెందిన శివ (డీజే యజమాని) వద్ద పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మండల పరిధిలోని నిర్థవెళ్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా డీజేతో నృత్యాలు చేస్తూ అధిక శబ్దాలతో హోరెత్తిస్తుండగా గ్రామస్తులు డయల్‌ 100కు కాల్‌ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి డీజేను సీజ్‌ చేశారు. య జమాని శివ, నిర్వాహకుడు ముష్రఫ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరహరి తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌

ముగ్గురికి తీవ్ర గాయాలు

షాద్‌నగర్‌రూరల్‌: ట్రాక్టర్‌ అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని రాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న బుర్ల ఇసాఖ్‌ వసంత దంపతులు తమ కుమారుడు యశ్వంత్‌, కుమారై అవనీకతో కలిసి ఆదివారం బైక్‌పై చర్చికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా హాజిపల్లి రోడ్డులో వెనుకనుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుర్ల ఇసాఖ్‌ వసంత, కుమారై అవనీకకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వసంత తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రణయ్‌ తెలిపారు.

దూసుకొచ్చి ఢీ కొట్టినలారీ.. వ్యక్తి మృతి

బాలానగర్‌: బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాదాచారిని ఢీకొట్టడంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలానగర్‌ నుంచి వై జంక్షన్‌ వైపు వెళుతున్న ఓ లారీ ఇందిరానగర్‌ యూటర్స్‌ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతుడు ఇందిరానగర్‌ నివాసి బానోత్‌ కిషన్‌ (45)గా గుర్తించారు. బాలానగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement