హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

పంజగుట్ట: చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యాన్సర్‌ విషయంలో టెస్టులే కీలకమని ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు శ్రీగిరి విజయ్‌ కుమార్‌ రెడ్డి, ప్రధానకార్యదర్శి రమేష్‌ వరికుప్పల అన్నారు. ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం జర్నలిస్టులకు, వారి కుటుంబాల కోసం బసవతారకం ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ నిర్వహించారు. సుమారు 150 మందికి పైగా జర్నలిస్టులు ఈ పరీక్షలు చేయించుకున్నారు. పలువురు సీనియర్‌ జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీఎఫ్‌ఐఈఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

వెంగళరావునగర్‌: తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా లింక రాజేంద్రప్రసాద్‌, కోశాధికారిగా వెల్లంకి శ్రీనివాస్‌ విజయం సాధించారు. యూసుఫ్‌గూడ డివిజన్‌ వెంకటగిరిలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి వల్లభనేని అనిల్‌కుమార్‌, చిట్టినేని కిశోర్‌బాబులు పోటీ చేశారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి అమ్మిరాజు కనుమిల్లి, లంక రాజేంద్రప్రసాద్‌, పేర్ని రాంబాబు, కోశాధికారి పదవికి జి.భీముడు(శ్రీకాంత్‌), వెల్లంకి శ్రీనివాస్‌కుమార్‌లు పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారు రెండేళ్ళ పాటు (2026–28) తమ పదవుల్లో కొనసాగుతారని చౌదరి తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement