కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం మొయినాబాద్‌: కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్‌ అన్నారు. మొయినాబాద్‌లోని భవన నిర్మాణ కార్మిక సంఘం, సెంట్రింగ్‌ అసోసియేషన్‌ యూనియన్‌ నాయకులు శుక్రవారం సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌ మాట్లాడుతూ.. కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఇన్సూరెన్స్‌ కార్డు తీసుకోవాలని సూచించారు. సీఐటీయూలో చేరినవారిలో భవన నిర్మాణ కార్మిక సంఘం, సెంట్రింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బుర్ర శంకర్‌, ప్రధాన కార్యదర్శి చింతల రవి, కోశాధికారి చింతల మోనాకర్‌, గౌరవ అధ్యక్షుడు చింతల దర్శన్‌, నాయకులు రామ్‌రెడ్డి, బాబు సాగర్‌, నవీన్‌సాగర్‌, శ్రీధర్‌, సతీష్‌, మల్లేష్‌, ప్రభుసాగర్‌, లక్ష్మీనారాయణ, యాదయ్య, ముత్యాలు, అశోక్‌, నర్సింగ్‌రావు, రాజు, ఆనంద్‌ తదితరులు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి షాద్‌నగర్‌: కులగణన నివేదిక ప్రకారం మాదిగలకు జనాభా శాతానికి తగిన విధంగా రిజర్వేషన్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఏకై క కులం మాదిగలు మాత్రమే అని మందకృష్ణ మాదిగ చేస్తున్న ప్రకటనలు నిజమేనని కులగణన నివేదికలు రుజువు చేస్తున్నాయని అన్నారు. జనాభాలో మాదిగలు 10.3 శాతం ఉన్నారని, ఎస్సీ వర్గీకరణలో కూడా అంతే వాటా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చిన సమయంలో 9 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిలో మార్పు తెచ్చుకొని న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు మద్దిలేటి, శంకర్‌రావు, రమేష్‌, నాగభూషణం, నరేష్‌ మాదిగ, రాజు, భాస్కర్‌, సురేష్‌, శ్రావణ్‌కుమార్‌, రాము, పాండు, సంగెం శ్రీను, వేణు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు తప్పనిసరి

షాద్‌నగర్‌రూరల్‌: ఇందిరమ్మ గృహపథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని హౌసింగ్‌ డీఈ సురేష్‌ సూచించారు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మొగిలిగిద్ద, రంగంపల్లి, ఎలికట్టలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. బిల్లుల విషయంలో లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, నేరుగా ఖాతాలోనే జమ అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ అన్వేష్‌, పంచాయతీ కార్యదర్శులు తేజస్విని, జైపాల్‌రెడ్డి, కారోబార్‌ శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement