హెచ్‌ఎండీఏలో దరఖాస్తుల పెండింగ్
● ఫీజు చెల్లించనివే 1.50 లక్షల అర్జీలు
● రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల పరిశీలనలో జాప్యం
సాక్షి, సిటీబ్యూరో: స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్ పథకం నత్తనడకన సాగుతోంది. దరఖాస్తులను పరిశీలించి పరి ష్కరించేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో సకాలంలో పరిశీలించి నివేదికలను అందజేయకపోవడంతో జాప్యం చోటుచేసుకుంటోంది. 2020లో రూపొందించిన ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవాటిలో హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 2.90 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఒక చీఫ్ ప్లానింగ్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లోని స్థలాలను రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలు సమగ్రంగా పరిశీలించి నివేదికలను అందజేయాల్సి ఉంది. చెరువులు, కుంటలు, తదితర నీటి వనరులకు సమీపంలో ఉన్న స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదు. వివా దాల్లో ఉన్న భూములకు సైతం తిరస్కరిస్తారు. ఈ మేరకు స్థలాల సాంకేతిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నివేదికలు అందజేయాల్సి ఉంటుంది. ఇలా ఎల్–1. ఎల్–2 దశలను దాటుకొని వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని హెచ్‌ఎండీఏ అధికా రులు ప్రొసీడింగ్స్ అందజేస్తారు. కానీ దరఖాస్తుదారులు మొదలుకొని, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల వరకు వివిధ దశల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ఇంకా ఫీజులు చెల్లించలేదు..
హెచ్‌ఎండీఏలోని ఘట్కేసర్, మేడ్చల్–1, మేడ్చల్–2, శంషాబాద్, శంకర్‌పల్లి–1, శంకర్ పల్లి–2 జోన్‌లలో మొత్తం 2,90,130 దరఖాస్తులు నమోదయ్యాయి.ప్రాథమిక పరిశీలన అనంతరం 2,02,356 దర ఖాస్తులను అధికారులు స్వీకరించి ఫీజు చెల్లించవలసిందిగా నోటీస్‌లు అందజేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 85,499 మంది ఫీజు చెల్లించగా మరో 1,50,587 మంది ఇంకా ఫీజులు చెల్లించకపోవడం గమనార్హం. ఒక్క ఘట్కేసర్ జోన్‌లోనే 63 వేలకు పైగా దరఖాస్తులు ఫీజు చెల్లించని పెండింగ్ జాబితాలో ఉ న్నాయి. ముందుగా ఫీజు చెల్లించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజులు చెల్లించిన వాటిలో 32,046 దరఖాస్తులకు అధికారులు ప్రొసీడింగ్‌లు అందజేశారు. ఫీజులు చెల్లించినప్పటికీ చెరువులు, కుంటలకు సమీపంలో ఉన్నవి, ఇతరత్రా వివాదాల్లో ఉన్న 1,659 దరఖాస్తులను తిరస్కరించారు. షార్ట్‌ఫాల్స్ కారణంగా సుమారు 32,414 భూయజమానుల వద్ద పెండింగ్‌లో ఉండగా, నీటిపారుదల, రెవెన్యూ విభాగాల స్థాయిలో మరో 48 వేల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలి పారు. సాంకేతిక కారణాలతోనే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియలో ఆలస్యమేర్ప డుతోందని అధికారులు తెలిపారు. మరోవైపు దరఖాస్తుదారులు సకాలంలో ఫీజులు చెల్లించి, షార్ట్‌ఫాల్స్‌ను భర్తీ చేసి ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.


