బహదుర్‌పురా: కేంద్ర జూ అథారిటీ బృందం నగరంలోని జూ పార్క్‌ను పరిశీలించి ఆదివారం నివేదికను తయారు చేశారు. ఇండియన్ జూస్ ఆన్ మేనేజ్‌మెంట్ ఎఫిక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్‌పై మూల్యంకనం చేశారు. ఈ నెల 8 నుంచి 11 వరకు సెంట్రల్ జూ అథారిటీ న్యూఢిల్లీ బృందం సభ్యులు మాజీ పీసీసీఫ్‌లు కేఎస్‌ఎస్‌వీపీ రెడ్డి, విలాస్ ఎస్.బర్దేకర్.. జూ నిర్వహణలో ఒత్తిళ్లను గుర్తించడం, ప్రణాళికను బేరీజు వేయడం, వనరులు, పరికరాలు, మానవశక్తిని అంచన వేయడం, వ్యవస్థల పరిశీలన, లక్ష్యాలపై సంతృప్తి వ్యక్తపరిచారు. ఇండియన్ జూస్ ఆన్ మేనేజ్‌మెంట్ ఎఫిక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్ నివేదిక ద్వారా సెంట్రల్ జూ అథారిటీ జూన్‌లో రేటింగ్‌లు ఇవ్వనుంది.


