రాష్ట్ర స్థాయికి ఎంపికై న శంకర్‌పల్లి విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయికి ఎంపికై న శంకర్‌పల్లి విద్యార్థి

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

రాష్ట్ర స్థాయికి ఎంపికై న శంకర్‌పల్లి విద్యార్థి ఓపెన్‌ వర్సిటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ తరగతులు న్యాయం చేసే వరకు పోరాటం

శంకర్‌పల్లి: యునైటేడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేన్‌ సోషల్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో శంకర్‌పల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శోభారాణి తెలిపారు. నగరంలోని హయత్‌నగర్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో బుధవారం ‘మాక్‌ ఐక్యరాజ్య సమితి సమావేశం’కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మోడల్‌ స్కూల్‌ 9వ తరగతి విద్యార్థి నందిని ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయికి వెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని సమాయత్తం చేసిన ఉపాధ్యాయురాలు వర సింధూరను ప్రత్యేకంగా అభినందించారు.

కోఆర్డినేటర్‌ శ్రీనివాసులు

షాద్‌నగర్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ ప్రత్యేక ప్రోగ్రాంను రూపొందించినట్లు వర్సిటీ కోఆర్డినేటర్‌ పాలాది శ్రీనివాసులు తెలిపారు. యూనివర్సిటీ రూపొందించిన ఈ ప్రోగ్రాంకు సంబంధించి వాల్‌పోస్టర్లను బుధవారం షాద్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటుగా, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రిటైలర్స్‌ అసోసియేషన్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వారి సహకారంతో వివిధ ప్రోగ్రాంలను రూపొందించారని తెలిపారు. పరిశ్రమ ఆధారిత అప్రెంటిషిప్‌, రిటైల్‌ రంగ ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, ప్రత్యక్ష వర్క్‌ప్లేస్‌ లెర్నింగ్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటిలో చేరిన విద్యార్థులకు నెలకు రూ.12,500–రూ.24 వేల స్టైఫండ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్‌, భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 18005 990101 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ

తుర్కయంజాల్‌: న్యాయపరమైన డిమాండ్‌లను నెరవేర్చే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు అన్నారు. బుధవారం రాగన్నగూడలోని ఇబ్రహీంపట్నం డివిజన్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించి, అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు, బిల్‌ కలెక్టర్లు, పీస్‌ రేట్‌ వర్కర్లను ఆర్టిజన్‌లుగా కన్వర్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగంలోంచి తీసివేస్తామని బెదిరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమకు న్యాయం చేసే వరకు ఎంతటి పోరాటినికై నా సిద్ధమని ప్రకటించారు. 98 ఆర్టీజన్లు ఈ సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సమ్మెలో పాల్గొంటున్నామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement