తుక్కుగూడ నుంచే పోలీస్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

తుక్కుగూడ నుంచే పోలీస్‌ సేవలు

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

మహేశ్వరం/తుక్కుగూడ: రాష్ట్ర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తుక్కుగూడ డివిజన్‌ పరిధి ఫ్యాబ్‌సిటీలో నిర్మిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయ పనులను ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ జి.సుధీర్‌బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సివిల్‌, విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ తదితర పనుల ను పరిశీలించారు. అవసరమైన మార్పులు చేయా లని ఇంజనీర్లకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిషనర్‌ కార్యాలయాన్ని సకల సౌకర్యాలతో, సిబ్బందికి, ప్రజలకు అందుబాటు లో ఉండేలా నిర్మిస్తున్నామని చెప్పారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లకు ఆదేశించామన్నారు. పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి చేయాలని సూచించారు. త్వరలోనే ప్రజలకు పూర్తిస్థాయిలో తుక్కుగూడ నుంచే పోలీస్‌ సేవలు అందుతాయన్నారు. అనంతరం మీరాఖాన్‌పేటలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. భవిష్యత్‌లో అక్కడ నిర్మించనున్న కమిషనర్‌ కార్యాలయం, ఇతర భవనాల మాస్టర్‌ ప్లాన్‌పై సంబంధిత అధికారులతో చర్చించారు. పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, అరుణ్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

డీజీపీ శివధర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement