యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

పహాడీషరీఫ్‌: పాత కక్షల నేపథ్యంలో తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యషాహిన్‌నగర్‌ వాదే సాల్హె హీన్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ సలీం కుమారుడు మహ్మద్‌ నసీర్‌ (22) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి నసీర్‌ స్నేహితులు మహ్మద్‌ దస్తగిర్‌, మహ్మద్‌ సుబాన్‌ద్దీన్‌ ఇంటికి వచ్చి దావత్‌ చేసుకుందామంటూ బయటికి తీసుకెళ్లారు. కాలనీ సమీపంలోని ఓపెన్‌ స్థలంలో అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో నసీర్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడని కాలనీకి చెందిన యువకుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించి నసీర్‌ మెడ, ఛాతి భాగాల్లో కత్తిపోట్లతో పాటు తలపై సిమెంట్‌ ఇటుకతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్‌ టీంను రప్పించి శాంపిళ్లు సేకరించారు. తాగిన మైకంలో పాత గొడవలను లేవనెత్తుకొని ఈ హత్యోదంతం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మహ్మద్‌ దస్తగిర్‌, మహ్మద్‌ సుబానుద్దీన్‌, మహ్మద్‌ ఇలియాస్‌, మహ్మద్‌ నదీం ఖాన్‌లే ఈ హత్యకు పాల్పడ్డారంటూ మృతుడి మేనమామ మహ్మద్‌ ఆరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చికిత్స పొందుతూ

జీపీ కార్మికుడి మృతి

చేవెళ్ల: గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన పంచాయతీ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కమ్మెట గ్రామ పంచాయతీలో ఈనెల 1వ తేదీన చాకలి మల్లయ్య(57)పై దుండగులు కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మృతి చెందాడు. మృతుడిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది ఇంకా పోలీసులకు తెలియరాలేదు. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులను శిక్షించాలి

కార్మికుడిపై దాడి చేసి హత్యచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌ డిమాండ్‌ చేశారు. కమ్మెట గ్రామ పంచాయతీలో వాటర్‌మెన్‌గా, డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లయ్యపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement