కందుకూరు: మండలంలోని నేదునూరు మోడల్ స్కూల్ విద్యార్థులకు జిల్లా స్థాయిలో అవార్డులు అందుకున్నారు. సోమవారం హయత్‌నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో స్టేట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యూఎన్‌ఓ) తరహాలో నమూనా పార్లమెంట్, నమూనా ఐక్యరాజ్య సమితి నిర్వహించారు. పిల్లల్లో వాక్ పఠిమ పెరగడానికి వివిధ దేశాల గురించి మాట్లాడాలి. అందులో భాగంగా నేదునూరు మోడల్ స్కూల్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని భవ్యశ్రీ, 9వ తరగతి విద్యార్థిని హారికలు ఈజిప్ట్, కాంగో దేశాలలో విద్యా, చైల్డ్ లేబర్ గురించి మాట్లాడి ఆకట్టుకున్నారు. దీంతో వారిద్దరికి జిల్లా స్థాయి మోడల్ యూఎన్‌ఓ అవార్డులను నిర్వాహకులు అందించి అభినందించారు.
రాష్ట్ర స్థాయికి ఎంపిక
బడంగ్‌పేట్: హయత్‌నగర్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రంగారెడ్డి జిల్లా స్థాయిలో మోడల్ యునైటెడ్ నేషనల్ పోగ్రాం నిర్వహించారు. బడంగ్‌పేటలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పూజశ్రీ ఈ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది. ఈ సందర్భంగా పూజశ్రీని ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు రమణారెడ్డి, పి.స్వామి, రమేష్, భారతి ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.


