యాచారం: పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండల పరిధిలోని నందివనపర్తిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం నగరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది. వెళ్లి చూడగా అల్మారాలో ఉన్న రూ.65 వేల నగదు, రెండున్నర తులాల బంగారం, 25 తులాల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.


