మతిమరుపుతో పట్టాలు దాటుతూ.. | - | Sakshi
Sakshi News home page

మతిమరుపుతో పట్టాలు దాటుతూ..

Apr 4 2026 8:55 AM | Updated on Apr 4 2026 8:55 AM

షాద్‌నగర్‌రూరల్‌: మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చిల్కమర్రి రైల్వేగేట్‌ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ మల్లేశ్వర్‌ కథనం ప్రకారం.. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పోలెమోని పద్మమ్మ (66) మూడేళ్లుగా మతిమరుపుతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున చిల్కమర్రి గ్రామసమీపంలోని రైల్వేగేట్‌ను దాటుతుండగా అదే సమయంలో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ పద్మమ్మను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పద్మమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. లోకో పైలెట్‌ సహకారంతో విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ స్టేషన్‌ మాస్టర్‌ అభిషేక్‌కుమార్‌ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ మల్లేశ్వర్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement