10న వాణిజ్య దుకాణాల వేలం | - | Sakshi
Sakshi News home page

10న వాణిజ్య దుకాణాల వేలం

Apr 4 2026 8:55 AM | Updated on Apr 4 2026 8:55 AM

కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి

మహేశ్వరం: మండలంలోని మన్సాన్‌పల్లి, మంఖాల్‌ గ్రామాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం కాలనీలలో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాలను విక్రయించడానికి జిల్లా కలెక్టర్‌, హౌసింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 10న బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని మంఖాల్‌ ఫేజ్‌–2(తుక్కుగూడ దగ్గరలో) 35 దుకాణాలు వాటి విస్తీర్ణం 189 చ. అడుగుల నుంచి 231 చ.అడుగుల వరకు ఉంటుంది. ప్రతి చదరపు అడుగు రూ.2,500గా నిర్ణయించారు. మన్సాన్‌పల్లి ఫేజ్‌–1, 2(మహేశ్వరం దగ్గరలో) మొత్తం దుకాణాలు 57 వాటి విస్తీర్ణం 130 చదరపు అడుగుల నుంచి 266 చదరపు అడుగుల వరకు, ప్రతి చదరపు అడుగు రూ.2000 నుంచి 2200 వరకు ఉంటుందన్నారు. ఈఎండీ మొత్తం రూ.36 వేలు ఏదైన జాతీయ బ్యాంకు నుంచి జిల్లా కలెక్టర్‌ రంగారెడ్డి జిల్లా పేరు మీద డిమాండ్‌ డ్రాఫ్ట్‌(డీడీ) తీసీ వేలం పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు పీడీ హౌసింగ్‌ మేనేజర్‌ 9063191168, పీడీ హౌసింగ్‌ 8712032727, ఆర్డీఓ కార్యాలయం డీటీ 7601055677 ఫోన్‌ నంబర్లకు సంప్రదించాలని కోరారు.

తెలంగాణపై సన్‌రైజర్స్‌ చిన్న చూపు

ఎస్‌ఆర్‌హెచ్‌ కార్యాలయం ఎదుట ధర్నా

సాక్షి, సిటీబ్యూరో: దేశవాళీ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఆ జట్టు యజమాని కావ్య మారాన్‌ సమాధానం చెప్పాలని తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్‌ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎస్‌ఆర్‌హెచ్‌ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రతినిధి నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. ఆరోన్‌ జార్జ్‌, అమన్‌రావు వంటి తెలంగాణ యువ ప్లేయర్లను ఎందుకు వేలంలో ఎస్‌ఆర్‌హెచ కొనుగోలు చేయలేదని నిలదీశారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు తెలంగాణ డబ్బులు, మౌలిక వసుతులు కావాలి కానీ, ఇక్కడి స్థానిక ప్లేయర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎస్‌ఆర్‌హెచ్‌ సవతి తల్లి ప్రేమను కట్టిపెట్టాలని అన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్‌, ప్రశాంత్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement