అణగారిన వర్గాల సమస్యలపై పోరు | - | Sakshi
Sakshi News home page

అణగారిన వర్గాల సమస్యలపై పోరు

Apr 4 2026 8:55 AM | Updated on Apr 4 2026 8:55 AM

చేవెళ్ల: అణగారిన వర్గాల సమస్యలపై ఎమ్మార్పీఎస్‌ పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతుందని సంఘం జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్‌మాదిగ అన్నారు. మండలంలోని దేవరంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించి నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి శివశంకర్‌మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 31 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని సాధించిన ఏకై క సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్‌దే అన్నారు. అయితే సంఘం కేవలం మాదిగలకే పరమితం కాకుండా సమస్త పీడిత అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని తెలిపారు. అనంతరం దేవరంపల్లి నూతన అధ్యక్షుడిగా ఎర్రవల్లి భిక్షపతి, ఉపాధ్యక్షుడిగా ఎర్రవల్లి రమేశ్‌, కార్యదర్శిగా గడ్డమీది శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా నర్సింలు, కోశాధికారిగా శివయ్య, అధికార ప్రతినిధిగా నవీన్‌ ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు నరేందర్‌, బాలు, యాదయ్య, ప్రవీణ్‌, జంగయ్య, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి శివశంకర్‌మాదిగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement