ఇబ్రహీంపట్నం: దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని.. అలాంటి విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం రోడ్డు భద్రతపై అరైవ్, అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా మెలగాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పక ధరించాలన్నారు. యువత, ప్రజలు రోడ్డు భద్రతను పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ జితేందర్‌రెడ్డి, స్థానిక ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు తదితరుకపాల్గొన్నారు.


