షాబాద్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన షాబాద్ పోలీస్ సేష్టన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ సమీపంలోని రోడ్డు పక్కన బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తు పడితే షాబాద్ పోలీస్ స్టేషన్ 87126 63450, 87125 68402 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


