షాబాద్: విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు కాలనీకి చెందిన సాయికుమార్‌గౌడ్ (35) మంగళవారం నాగరకుంట సమీపంలో మామిడి తోటలో మామిడికాయలు తెంపుతున్నాడు. చెట్టు మధ్యలో విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయికుమార్‌గౌడ్ రెండేళ్లుగా మండల పరిధిలోని హైతాబాద్ వెల్స్‌పన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


