షాద్‌నగర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం అన్నారు. సోమవారం పట్టణంలోని 27వ వార్డు న్యూసిటీ కాలనీలో మున్సిపల్ చైర్మన్ బస్వం, కౌన్సిలర్ మురళీమోహన్ పర్యటించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం


