గౌరవం ఇవ్వలేదని నిరసన | - | Sakshi
Sakshi News home page

గౌరవం ఇవ్వలేదని నిరసన

Mar 29 2026 8:53 AM | Updated on Mar 29 2026 8:53 AM

యాచారం: పరిపాలన వ్యవహరాల్లో సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి కనీస సమాచారంతో పాటు, ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని మాల్‌ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు దొంతగోని స్వాతి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నల్ల గుడ్డతో కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఒకటో వార్డు సభ్యురాలిగా గెలిచినప్పటికీ తన వార్డు పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఏ పనులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తనను అవమానపర్చుతున్న సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement