మొయినాబాద్: ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయనే వదంతులతో వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం పరుగులు తీశారు. బంకుల్లో భారీగా వాహనాలు క్యూకట్టాయి. మంగళవారం మొయినాబాద్‌లోని పెట్రోల్ బంకుల్లో భారీగా వాహనాలు క్యూకట్టాయి. దేశంలో పెట్రో నిల్వలు తగ్గాయని.. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ రావడంలేదని రెండు రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో బంకులకు పరుగెత్తి డబ్బాలు, బబుల్స్‌లో పోయించుకుంటున్నారు. వాహనా ల్లోనూ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు.
పెట్రోల్, డీజిల్ కోసం పరుగులు


