కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాల వినియోగం కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని సర్పంచ్‌ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఎకై ్సజ్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవిని కలిసి వినతిపత్రం అందజేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణ, వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లోని యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, నేరాల పెరుగుదల, రోడ్డు ప్రమాదాల వంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె దృష్టికి తెచ్చారు. ఆయా మండలాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి డ్రగ్స్, గంజాయి కదలికలను అరికట్టాలని కోరారు. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ధర నిమ్మదిరిగేలా..
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడంతో వంటి కారణాలతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్‌సేల్ మార్కెట్‌లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు టోకు మార్కెట్‌లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి. స్థానిక మధ్యవర్తులు రైతుల నుంచి నిమ్మకాయలను కొనుగోలు చేసి ఢిల్లీ వ్యాపారులకు అమ్ముతున్నారు. అక్కడ వారికి మంచి ధర లభిస్తోంది. దీని కారణంగా స్థానికంగా సరఫరా కూడా తగ్గిపోయాయి అని చాదర్‌ఘాట్‌లోని నిమ్మ వ్యాపారి సయ్యద్ రఫీ చెప్పారు.


