నిర్మాణ పనులు వేగిరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనులు వేగిరం చేయాలి

Mar 25 2026 9:23 AM | Updated on Mar 25 2026 9:23 AM

రాష్ట్ర విద్యా శాఖ కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ పరిశీలన

మంచాల: వచ్చే నెల 11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. మండలంలోని ఆరుట్లలో కొనసాగుతున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరుట్ల మాదిరిగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించడమే గాకుండా కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా పాఠశాలలను నిర్వహించి మార్పు తేవాలని ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ నిర్వహణ కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ ఫోరం సభ్యులు పద్మషా, ప్రధానోపాధ్యాయుడు గిరధర్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ నూకం రాజు ముదిరాజ్‌, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement