కొండిగారి రాములు సేవలు ఎనలేనివి | - | Sakshi
Sakshi News home page

కొండిగారి రాములు సేవలు ఎనలేనివి

Mar 23 2026 10:04 AM | Updated on Mar 23 2026 10:04 AM

కొండిగారి రాములు సేవలు ఎనలేనివి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం వేం నరేందర్‌రెడ్డికి సన్మానం

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు నియోజకవర్గానికి చేసిన సేవలు మరవలేనివని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ కేంద్రంలో ఆదివారం జరిగిన రాములు దశదిన కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమ్యూనిస్టువాదిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాములు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిని కోరుకున్నారన్నారు. ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అనంతరం రాములు కుమారులు త్రిలోక్‌(కౌన్సిలర్‌), కిరణ్‌కుమార్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌, నిట్టు జగదీశ్వర్‌, భరత్‌కుమార్‌, ఎండీ సుల్తాన్‌, ఆకుల సురేష్‌, మల్లేష్‌యాదవ్‌, ముత్యాల చిన్న, శివసాయి, ప్రవీణ్‌, వీరేష్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌: చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్‌ నగరంలోని సైనిక్‌పురిలో ఆదివారం జరిగిన 108 శ్రీరామ భక్తి గీతాల గాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వరరాజ భారతీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ భజనలు, కీర్తనలు, నామసంకీర్తనలు చేశారు. భక్తులందరినీ ఆధ్యాత్మిక భక్తి రసంలో ముంచిన భక్తి సంగీత కార్యక్రమం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యాభారతి, రంగరాజన్‌ను సన్మానించారు.

తెలంగాణ సేవా ప్రముఖ్‌ శివశంకర్‌

షాబాద్‌: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ సేవా ప్రముఖ్‌ శివశంకర్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగర్‌గూడ పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం ఉప మండల హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా శివశంకర్‌తోపాటు శ్రీమతి శ్రీలత, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా కార్యదర్శి అష్ట తీర్థస్వామిజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పారు. పంచ పరివర్తనలో భాగంగా ప్రకృతిని కాపాడుకోవాలని, పౌర విధులు పాటించాలన్నారు. హిందువు అనేది మతం కాదు, ఇది ఒక ధర్మం అని వివరించారు. అనంతరం భగవద్గీత పారాయణం చేశారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, యాదివరెడ్డి, ప్రసాద్‌, మల్లేష్‌, ప్రవీణ్‌, గూడెం రమేష్‌, వెంకట్‌రెడ్డి, ప్రశాంత్‌, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌రూరల్‌: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని ఆదివారం సర్పంచ్‌ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి, కాశీంబౌలి సర్పంచ్‌ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement