డ్రగ్స్‌ దందాకు కేరాఫ్‌ బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ దందాకు కేరాఫ్‌ బీఆర్‌ఎస్‌

Mar 23 2026 10:04 AM | Updated on Mar 23 2026 10:04 AM

షాద్‌నగర్‌: రాష్ట్రంలో డ్రగ్స్‌ దందాకు బీఆర్‌ఎస్‌ పార్టీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ విమర్శించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ అంకెల గారడీతో ప్రజలను మోసం చేసిందని అన్నారు. బంగారు తెలంగాణను చేస్తామని చెప్పి అప్పుల ఊబిలో ముంచిందన్నారు. ఇటీవల ఫాంహౌస్‌లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో బీఆర్‌ఎస్‌ నేతల డ్రగ్స్‌ వ్యవహారం బట్టబయలైందని, దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోందన్నారు. కాంగ్రెస్‌ అఽధికారంలోకి వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతు భరోసా, రైతు బీమా ద్వారా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. సమావేశంలో నాయకులు రఘు నాయక్‌, శ్రీకాంత్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్‌, కృష్ణారెడ్డి, వీరేశం, హరినాథ్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, రవికుమార్‌గుప్తా, రాజు, కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement