ప్రభుత్వానికి మార్కెట్ కట్టే ఉద్దేశం లేదు. చదును చేసి, స్వాధీనంలో ఉన్న భూములను వదిలేసి.. వివాదాలున్న భూములను ఎంపిక చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో? మార్కెట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు యత్నిస్తోంది. ఇక్కడ ఎకరం రూ.6 నుంచి రూ.10 కోట్లు పలుకుతోంది. ఖరీదైన ఈ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. బలవంతపు భూసేకరణకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం.
– కందాల బలదేవ్‌రెడ్డి, రైతు
నాలుగు తరాలుగా అనేక కుటుంబాలు ఈ భూములను నమ్ముకుని బతుకుతున్నాయి. 12 ఏళ్లుపైబడి పేదలు జీవనం కొనసాగిస్తే..వాటిని ముట్టుకునే అధికారం ఎవరికీ లేదు. ఔటర్‌రింగ్ రోడ్డు సహా ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా..పేదల భూములే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతోంది. పేదల భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. బాధిత రైతులకు అండగా నిలబడతాం. ఇప్పటికే సేకరించి రెడీగా ఉన్న భూమిలోనే మార్కెట్ కట్టాలి.
– ఈటల రాజేందర్, ఎంపీ, మల్కాజిగిరి


