షాబాద్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చందనవెళ్లిలో తలారి లక్ష్మమ్మ ఇందిరమ్మ ఇంటిని, కొత్త కాలనీకి వేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే నిరుపేదల సొంత ఇంటి కల సాకారం అవుతుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అవినీతికి తావు లేకుండా, పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని, మరో మూడు విడతల్లో మిగిలిన వారికి ఇళ్లు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచ్‌లు నవనీతస్వామి, స్వరూపమహేందర్‌గౌడ్, యాదిరెడ్డి, నర్సింలు, ప్రభాకర్‌రెడ్డి, యాదయ్య, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌నాయక్, బేగరి యాదయ్య, భార్గవ్‌రామ్, బండ శ్రీకాంత్‌గౌడ్(కిట్టు), కృష్ణ, రాఘవాచారి, తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి


