షాద్‌నగర్‌రూరల్: గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంతను ప్రజలు వినియోగించుకోవాలని ఎశమోని కృష్ణ్డ అన్నారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్దలో ఆయన ఆధ్వర్యంలో నూతనంగా సంతను ఏర్పాటు చేశారు. ఈ సంతను గ్రామపెద్దలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంతలో రైతులు పండించిన పంటలు, అనేక రకాల ఉత్పత్తులు ఒకేచోట లభిస్తాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నూతనంగా సంతను ఏర్పాటు చేసేందుకు గ్రామపంచాయితీ పాలకవర్గం నిర్ణయం తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మిరాము, గ్రామపెద్దలు అన్మారి వెంకటయ్య, దయాసాగర్, రాధాకృష్ణ, శ్రీశైలం, మల్లేశ్, పటాన్‌పాషా, చోటేభాయ్, తవుడు వెంకటేశ్, కార్యదర్శి జైపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ ఎశమోని కృష్ణ


