కొందుర్గు: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, తాగునీటి సరఫరాకు సంబంధించిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ వికసిత్ భారత్– 2047 కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఇందుకోసం అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎదిర రాజు, నాయకులు అందె బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, వెంకటేశ్ గుప్తా, సుధాకర్ రావు, శంకర్, అశోక్, శివారెడ్డి పాల్గొన్నారు.


