డీఎల్‌పీఓ సాంబిరెడ్డి
కడ్తాల్: పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులకు సంపూర్ణ అవగాహన ఉండాలని కందుకూర్ డీఎల్‌పీఓ సాంబిరెడ్డి సూచించారు. సోమవారం కడ్తాల్ రైతువేదికలో పంచాయతీ వార్డు సభ్యులకు వారం రోజుల పాటు రెండో విడత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ లాలయ్య, శిక్షణ అధికారులు రమేశ్, మౌనిక, ప్రసాద్ మైసిగండి, మక్తమాదారం, మర్రిపల్లి, ముద్వీన్, నార్లకుంటతండా, న్యామతాపూర్, పల్లెచెలకతండా, పీవీబీయితండా, రేఖ్యతండా, సాలార్‌పూర్, వాస్‌దేవ్‌పూర్ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇంధన ఇబ్బందులు షురూ
మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే వంట గ్యాస్‌కు ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ సైతం దొరకడం కష్టంగా మారింది. మండల కేంద్రంలోని సాయి చంద్ర ఫిల్లిం స్టేషన్‌లో రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ అందుబాటు లేదు. దీంతో సిబ్బంది ‘నో స్టాక్ ’బోర్డు తగిలించారు. గ్రామాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయించే కిరాణ దుకాణాదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


