మొయినాబాద్‌రూరల్: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల ఫైర్ స్టేషన్ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, గ్రామస్తులకు చేవెళ్ల ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పాల్గొని వంట గ్యాస్ సిలిండర్, ఎలక్ట్రికల్, ఆయిల్ మంటలు జరిగే సమయంలో తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. ప్రయోగపూర్వకంగా మంటలు ఆర్పే విధానాన్ని చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఫైర్ అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో ఫైర్ ఆపరేటర్ గోపాల్, సర్పంచ్ పెద్దవీటి అర్చనఅజయ్‌రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దవీటి విజయ్‌రెడ్డి, ఉపసర్పంచ్ ప్రభాకర్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.


