కొకౌన్‌ లాయా! | - | Sakshi
Sakshi News home page

కొకౌన్‌ లాయా!

Mar 17 2026 8:42 AM | Updated on Mar 17 2026 8:42 AM

గతంలో నిర్వహించిన పార్టీలపై ఆరా రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై ప్రత్యేక నిఘా అతిథి గృహానికి వచ్చివెళ్తున్న వారిపై నజర్‌

మొయినాబాద్‌: మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ, కాల్పుల కలకలం కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. విందులో వినియోగించిన కొకై న్‌ ఎవరు సరఫరా చేశారు.. ఎంత కాలం నుంచి ఇక్కడ డ్రగ్స్‌ పార్టీలు జరుగుతున్నాయి.. ఇక్కడికి తరచూ ఎవరెవరు వస్తుంటారు..? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. అజీజ్‌నగర్‌లోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ పార్టీని ఈగల్‌ టీం భగ్నం చేసిన విషయం తెలిసిందే. విందు ప్రారంభం కాగానే ఎస్‌ఓటీ,స్థానిక పోలీసులతో కలిసి ఫాంహౌస్‌కు చేరుకున్న ఈగల్‌ బృందానికి ఊహించని ఘటన ఎదురైంది. పోలీసులు లోనికి వెళ్లగానే కాల్పుల శబ్దం రావడంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. తాము పోలీసులమని చెబుతున్నా పట్టించుకోకుండా నాలుగు రౌండ్లుఫైరింగ్‌ జరపడంపై నిర్ఘాంతపోయారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఫాంహౌస్‌లోకి వెళ్లడం, ఫైరింగ్‌కు పాల్పడిన వ్యక్తితో పాటు ఘటనా స్థలంలో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించడం చకచకా జరిగిపోయాయి. ఈ కేసులో రోహిత్‌రెడ్డి, అతని తమ్ముడు రితీష్‌రెడ్డితో పాటు ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమిత్‌శర్మను ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ కోర్టు జడ్జి వీరికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో జైలుకు వెళ్లారు. ఈ డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌తోపాటు మరో ఏడుగురికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపిన విషయం తెలిసిందే.

గతంలో జరిగిన పార్టీలపై ఆరా..

రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఎప్పుడెప్పుడు పార్టీలు జరిగాయనే విషయాలపై పోలీసులు పకడ్బందీగా వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత ఇక్కడ పలుమార్లు విందులు జరిగినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఫాంహౌస్‌ వ్యవహారాలపై ప్రతీ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. నెలలో రెండు మూడు సార్లు రోహిత్‌రెడ్డి తన ఫాంహౌస్‌లో పార్టీలు నిర్వహిస్తుంటారని తెలుస్తోంది. వచ్చిన ప్రతీసారి కొత్త వ్యక్తులే వస్తారని, ఒకసారి వచ్చిన వారు మళ్లీ రావడం అరుదేనని ప్రచారం. ఇలా ఇప్పటి వరకు వచ్చిన వారి వివరాలపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. పార్టీల సందర్భంగా విదేశీ మద్యం, గాంజా, డ్రగ్స్‌ వినియోగించారా..? ఒకవేళ వినియోగిస్తే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు తెచ్చారు. ఎవరెవరు తీసుకున్నారు అనే అంశాలను రాబడుతున్నారు.

ఫాంహౌస్‌పై నిఘా...

వరుస వివాదాల నేపథ్యంలో రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్‌ పార్టీ, కాల్పుల కలకలం అనంతరం ఇక్కడికి ఎవరెవరు వచ్చారనే విషయాలను తెలుసుకునేందుకు గస్తీ కాస్తున్నారు. డ్రగ్స్‌ పార్టీతో ఇంకా ఎవరికై నా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.

డ్రగ్స్‌ సరఫరాపై కూపీ లాగుతున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement