గ్యాస్‌ కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరత లేదు

Mar 17 2026 8:42 AM | Updated on Mar 17 2026 8:42 AM

కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: జిల్లాలో గృహ అవసరాలకు గ్యాస్‌ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు అవసరమైన నిల్వలను అందుబాటులో ఉన్నాయని, ఎల్పీజీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక మానిటరింగ్‌ కమిటీ పనిచేస్తోందని, బుకింగ్‌లు, స్టాక్‌పై రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ అధికారి ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూం కొనసాగుతోందని, 7989868271 నంబరులో సంప్రదించాలని, సామాజిక మధ్యమాల్లో ప్రచారమవుతున్న వదంతులను నమ్మవద్దని సూచించారు.

‘జల వనిత’కు సత్కారం

ఆమనగల్లు: జల జీవన్‌ మిషన్‌ అమలులో విశేష కృషి చేసిన ఆమనగల్లు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన తెలగమల్ల ఆనంద జలవనితగా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన జల మహోత్సవ్‌ (2016)లో పాల్గొన్న ఆమెను సోమవారం కలెక్టర్‌ నారాయణరెడ్డి ఘనంగా సత్కరించారు. తెలంగాణ నుంచి ముగ్గురు మహిళా సర్పంచ్‌లు, ముగ్గురు జల వనితలు, ముగ్గురు స్వయం సహాయక బృందాల సభ్యులు జలమహోత్సవ్‌లో పాల్గొన్నారని, ఇందులో ఆనంద ఉండటం అభినందనీయమ కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెన్నంపల్లి సర్పంచ్‌ తెలగమల్ల ప్రశాంతి రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

కుంగ్‌ఫూలో సత్తాచాటిన షాద్‌నగర్‌ విద్యార్థులు

షాద్‌నగర్‌: జాతీయ స్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో షాద్‌నర్‌ విద్యార్థులు సత్తాచాటారు.పట్టణంలో ని ఠాగూర్‌ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో సోమవారం కుంగ్‌ఫూ మాస్టర్‌ బాల్‌రాజ్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన పోటీల్లో న్యూపవర్‌ కుంగ్‌ఫూ అకాడమీ విద్యార్థులు ప్రేమ్‌కుమార్‌, రా హుల్‌ కట్ట ఉత్తమ ప్రతిభ కనబరిచి, ట్రోఫీలు సొంతం చేసుకున్నారు. మాస్టర్‌ అహ్మద్‌ఖాన్‌, గ్రాండ్‌ మాస్టర్‌ వీరాచారి విజేతలకు బహుమతులు అందజేశారు.

నిందితులకు

నాలుగు రోజుల జైలు

మోమిన్‌పేట: పీటీ కేసు నిందితులకు నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ భరత్‌భూషన్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని కాస్లబాదు గ్రామానికి చెందిన సండ్ర మొగులయ్య, సండ్ర కిష్టయ్య పరస్పరం గొడవపడి ఠాణలో ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేశా మన్నారు. వారిని వికారాబాద్‌ కోర్టులో హాజరుపరచగా స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ రెండో తరగతి కోర్టు జడ్జి మాయ బ్రహ్మనర్సింహ నిందితులకు నా లుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement