షాద్‌నగర్ డీసీపీ శిరీష
షాద్‌నగర్ రూరల్: మహిళలు చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని షాద్‌నగర్ డీసీపీ శిరీష అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్‌బీఐ సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికల విద్య సమాజానికి ఎంతో అవసరం అన్నారు. విద్యార్థినులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం డీఓఏ సుశీందర్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందన్నారు. రోటరీ క్లబ్ జోనల్ కోఆర్డినేటర్ సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. పది జిల్లాలోని దాదాపు 550 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు సానిటరీ న్యాప్‌కిన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల శ్రవణ్‌రెడ్డి, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ రాజశేఖర్, ఎంఈఓ మనోహర్, ప్రధానోపాధ్యాయురాలు పద్మనళిని, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు గోవింద్‌పుట్ట, గవర్నర్ గోపీనాథ్‌రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, గోవింద్, శ్రీకాంత్‌రెడ్డి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.


