ఇబ్రహీంపట్నం: గ్యాస్ సిలిండర్ల కొరత, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ఇబ్రహీంపట్నంలో సోమవారం సీపీఐ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కావలి నర్సింహ్మ, మండల కార్య దర్శి కావలి సురేష్ మాట్లాడుతూ.. పెట్రో, గ్యా స్ సిలిండర్ల కొరతతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సాకుతో అన్ని రకాల వస్తువులపై ధర లు పెంచారని ఆరోపించారు. ఇదే పరిస్థితులు కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శ్రీకాంత్, కిరణ్, అభి, అజయ్, రాజు, మధు పాల్గొన్నారు.


