హయత్‌నగర్: మునుగనూరుకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కేటాయింపుతో మునుగనూరు అభివృద్ధిలో ముందడుగు పడిందని ఎమ్మెల్యే అన్నారు. శనివారం ఆయన మునుగనూరులో ఏర్పాటు చేసిన నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. వినియోగదారులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అవినీతి లేకుండా పనులు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి నాయకులు మంగమ్మ శివకుమార్, మల్‌రెడ్డి యాదిరెడ్డి, వేముల అమరేందర్‌రెడ్డి, నక్క శ్రీనివాస్‌గౌడ్, ముత్యా ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


