రౌడీయిజాన్ని అణచివేస్తాం
పహాడీషరీఫ్: రౌడీషీటర్ల నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెలగాలని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి సూచించారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు శనివారం ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్ల గత నేర చరిత్ర, ప్రస్తుతం చేస్తున్న పని, ఇటీవల ఏమైనా నేరాలలో ప్రమేయమున్నారా? అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వారు పనిచేసే ప్రదేశంలో కూడా వ్యవహార శైలిపై పరిశీలిస్తామన్నారు. సామాన్య ప్రజల పట్ల బెదిరింపులకు పాల్పడినట్లయితే ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి పూట రౌడీషీటర్లు ఇంట్లోనే ఉండాలని, ఏ సమయంలోనైనా పెట్రోలింగ్ వాహనం తనిఖీకి వస్తుందని పేర్కొన్నారు. ప్రవర్తన మార్చుకోకుండా క్రమం తప్పని నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ లు దయాకర్‌రెడ్డి, లక్ష్మయ్య, ఫైజల్ అహ్మద్ పాల్గొన్నారు.


