20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
శంకర్‌పల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శుక్రవారం మోకిల పోలీసులు పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లకి చెందిన మహబూబ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా గ్రామాల్లో తిరుగుతూ అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నాడు. తర్వాత వాటిని పీఎస్ పరిధిలోని జన్వాడలో నిల్వ ఉంచాడు. పోలీసులు పక్కా సమాచారం అందుకోని దాడులు నిర్వహించి, 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, డీసీఎం వాహనాన్ని సీజ్ చేసి ఠాణాకి తరలించారు. మహబూబ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


