ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన చైర్మన్‌

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన చైర్మన్‌

ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన చైర్మన్‌

ఆమనగల్లు: నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలను ఆమనగల్లు మున్సిపల్‌ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికై న పత్యానాయక్‌ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో విమానాశ్రయంలో ఎంపీ మల్లు రవిని స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ పత్యానాయక్‌ను మల్లు రవి అభినందించారు. అనంతరం తన నివాసంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని చైర్మన్‌ పత్యానాయక్‌ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే నారాయణరెడ్డిలకు చైర్మన్‌ పత్యానాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గుర్రం కేశవులు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మానయ్య, సత్యం, కృష్ణనాయక్‌, రాజేందర్‌నాయ క్‌, శ్రీధర్‌నాయక్‌, రవీందర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement