కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు
పరిగి: బీఆర్‌ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరయ్యామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ అన్నారు. బీఆర్‌ఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమంతోనే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగామన్నారు. జైలుపాలు చేసిన ప్రజల కోసం నిలబడినందుకే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, జగన్, సోయాబ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


