ఎన్నికల నిబంధనలు పాటించాలి
మంచాల: గ్రామాల్లో ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివా స్ అన్నారు. మండలంలోని ఆరుట్ల ఆదర్శ పా ఠశాలలో శుక్రవారం మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయనముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన నియమాలు, నిబంధనలు అమలు పర్చాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతోప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలశంకర్, తహసీల్దార్ వెంకటప్రసాద్,ఎంఈఓ రాందాస్ పాల్గొన్నారు.
విద్యార్థులకు
స్కాలర్‌షిప్ పంపిణీ
మీర్‌పేట: మనం అమెరికా వెళ్లడం కాదు.. అమెరికాలో ఉన్న వారిని మన దేశ అభివృద్ధికి తీసుకురాగల స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆకాంక్షించారు. మీర్‌పేట సర్కిల్‌లోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమా ల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి శుక్రవా రం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యార్థులు అదృష్టవంతులని, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఉన్నత విద్యావకాశాలు కల్పించామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ఏటీఏ సభ్యుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఏటీఏ అధ్యక్షులు చల్లా జయంత్‌రెడ్డి, చల్లా బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ
ఎన్నికలపై శిక్షణ
కందుకూరు: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. కొత్తగూడ పరిధిలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిసైడింగ్, స్టేజ్–2 అధికారులకు పంచాయతీ ఎన్నికల పై శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..ఎన్నికల నియమావళి ప్రకా రం విధులు నిర్వర్తించాలన్నారు. మాస్టర్ ట్రైన ర్లు ఇమాన్యూల్, మల్లేశం విధి విధానాలపై శిక్ష ణ ఇచ్చారు.కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారి సుధారాణి, ఎంపీడీఓ సరిత పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఆధ్యాత్మిక–
సంగీత కార్యక్రమం
మొయినాబాద్: ఆధ్యాత్మిక గంభీరత, భావరసం, రాగబంధం, సాహిత్య సౌందర్యంతో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయంలో శుక్రవారం తెలంగాణ భక్తి సంగీత సంపదలో విశిష్ట స్థానం సంపాదించిన రాకమచర్ల వెంకటదాసు కీర్తనలు, శేషులతా విశ్వనాథ్ స్వరరచనలో సంప్రదాయ భజన శైలిలో చేపట్టిన ఆధ్యాత్మిక–సంగీత కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఆలయ అర్చక ధర్మకర్తలు ఎంవీ సౌందరరాజన్, గోపాలకృష్ణస్వామి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కీర్తనల్లోని రాగభావం, ఆధ్యాత్మికత, వాగ్గేయకార శైలి వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఎన్నికల నిబంధనలు పాటించాలి


