దైవ చింతన అలవర్చుకోవాలి
కేశంపేట: మానవుడు దైవ చింతనతో మాధవుడిగా మారాలని కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మెంతాల మహేశ్వర్ అన్నారు. మండల పరిధిలోని నిర్ధవెళ్లి గ్రామంలో కిషన్‌ప్రభు ధర్మప్రచార సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా మద్భగవద్గీతా జయంతి మహోత్సవాలను నిర్వహించారు. ఆదివారం మహేశ్వర్‌తో పాటుగా తొమ్మిదిరేకుల గ్రామ ఆశ్రమ స్వామి అమృతానందగిరి స్వామి, అష్టలక్ష్మి దేవాలయం జడ్చర్ల నుంచి కృష్ణానందస్వామి, భూమనందస్వామి, ముక్తేశ్వరనందగిరి స్వామిలు పాల్గొని భగవద్గీతపైన భక్తులకు ప్రవచలను అందించారు. వారం రోజులుగా గ్రామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామం, భగవద్గీత యజ్ఞంతో పాటుగా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణయ్య, అయ్యపురెడ్డి, శివరాములు, యుగందర్‌రెడ్డి, హరికిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


