కేన్సర్‌తో చితికిన కుటుంబానికి చేయూత
సాక్షి, సిటీబ్యూరో: కేన్సర్‌తో చితికిన కుటుంబానికి ఎకై ్సజ్ శాఖ రూ.2.45 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ చేతుల మీదుగా ఈ సహాయాన్ని అందజేశారు. ధూల్‌పేట్ ఎకై ్సజ్ స్టేషన్‌లో 12 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ మహ్మమద్ హైమద్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన భార్య హర్షియా దివ్యాంగురాలు. వీరికి ఇద్దరు పిల్లలు. వారిలో 11 సంవత్సరాల రేహన్ బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది, అధికారులు కలిసి సేకరించిన రూ.2.45 లక్షల నగదును మంగళవారం కమిషనర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నవీన్ చేతుల మీదుగా అందజేశారు.


