ఎకై ్సజ్ పోలీసుల తనిఖీలు
● 120 కిలోల చొప్పున
నల్లబెల్లం, పటిక స్వాధీనం
● ఇద్దరి అరెస్టు, రిమాండ్
ఆమనగల్లు: కడ్తాల మండల కేంద్రానికి సమీపంలోని హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి టోల్‌గేట్ వద్ద మంగళవారం ఉదయం ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్‌చౌహాన్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో 120 కిలోల బెల్లం, పటికను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. టోల్‌గేట్ వద్ద ఆటోను తనిఖీ చేయగా ఆరు బ్యాగులలో 120 కిలోల చొప్పున నల్లబెల్లం, పటిక స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్, బిచ్చాలను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బద్యానాద్‌చౌహాన్ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐ అరుణ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ శంకర్, సిబ్బంది బాబు, శ్రీను, ఆమని తదితరులు పాల్గొన్నారు.
సారా తయారీ చేస్తే కఠిన చర్యలు
నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ సీఐ బద్యానాద్‌చౌహాన్ హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలోని ఎకై ్సజ్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆయన మాట్లాడుతూ.. నాటుసారాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. నాటుసారా తయారు చేసినా విక్రయించినా చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాకు నాటుసారా తయారీ కోసం నల్లబెల్లం, పటిక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విస్తృత తనిఖీలు నిర్వహించామని చెప్పారు.


