ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వరుస ప్రమాదాలు
షాద్‌నగర్: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చేవెళ్ల బస్సు ప్రమాదం తనను ఎంతో కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. బీజాపూర్ –హైదరాబాద్ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసినా విస్తరించడం లేదని తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ మార్గంలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీలు, టిప్పర్లను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మామూళ్ల మాయలో పడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మోహన్‌సింగ్, నర్సింహ్మ యాదవ్, సుధాకర్, చిట్టెం లక్ష్మీకాంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి


